ఒడిశాలో జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్ళితే.... గోచాబాదికి చెందిన సూర్యకాంత్ బెహరా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 22 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది నవంబర్‌లో సూర్యకాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి అతడు కొడాలా సబ్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు, బాధిత యువతి ఇద్దరూ పెళ్లికి అంగీకరించినట్టు వారు కోర్టులో పిటిషన్ వేశారు. పరిశీలించిన న్యాయస్థానం వారి వివాహానికి అంగీకరించింది. దీంతో కొడాలా సబ్ జైలులో అధికారులు వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. అయినప్పటికీ తుదితీర్పు వెలువడే వరకు సూర్యకాంత్ జైలులోనే ఉండనున్నాడు.
![]() |
![]() |