జెఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ముఖ్య సమాచారం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ ఈ రోజు (గురువారం) జెఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా తమ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది మే 18న జెఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు షిఫ్ట్‌లలో నిర్వహించబడింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు మొత్తం 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ సమాధానాలన్నీ రెస్పాన్స్ షీట్‌లో పరిశీలించి, త్వరలో విడుదల కానున్న ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పోల్చుకుని తాము అందించిన సమాధానాలపై అంచనా వేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa