శీతాకాలం వచ్చిదంటే చాలు.. జుట్టు, చర్మ సమస్యలు పెరిగిపోతాయి. ముఖ్యంగా జుట్టు రాలడం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ సీజన్‌లో జుట్టు, చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలి వాతావరణం మన జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని, కొన్నిసార్లు తల చర్మం ఎండిపోతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పోషకాహార లోపం వల్ల జుట్టు రాలుతుంది. సరైన సమయంలో కారణాన్ని గుర్తిస్తే.. జుట్టు రాలడాన్ని సులభంగా నియంత్రించవచ్చు. శీతాకాలపు గాలిలో తేమ తగ్గుతుంది. దీంతో, చుండ్రు సమస్య కూడా వస్తుంది. ఇక, జుట్టు రాలడంతో పాటు చుండ్రు తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్ లేదా షాంపూలు వాడుతుంటారు.
అయినా, ఇవి జుట్టు రాలడాన్ని నియంత్రించవు. దీంతో చాలా మంది ఆందోళన చెందుతారు. జుట్టు రాలడం ఎక్కువై.. బట్టతల వస్తుందన్న ఆందోళన ఉంటుంది. అయితే, ఇలాంటి వారి కోసం డాక్టర్ నవనీత్ కౌర్ భాటియా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక చిట్కాను షేర్ చేశారు. ఆ చిట్కా పాటిస్తే జుట్టు రాలడం తగ్గడంతో పాటు చుండ్రు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇందులో ముఖ్యమైన పదార్థం టీ పొడి. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
టీ పొడి - ఒక టేబుల్ స్పూన్
షాంపూ - మార్కెట్లో దొరికే రూపాయి షాంపూ సరిపోతుంది
నీరు - 200 మి.లీ
మెంతులు - ఒక టీస్పూన్
బియ్యం - రెండు టీ స్పూన్లు
కరివేపాకు - కొన్ని రెబ్బలు
తయారీ విధానం
జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం, చుండ్రు వంటి సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఇంట్లోనే హెర్బల్ షాంపూ తయారు చేసుకోవచ్చని డాక్టర్ నవనీత్ కౌర్ భాటియా వివరిస్తున్నారు. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ఉంచండి. ఈ పాన్‌లో ఒక టీ స్పూన్ టీ పొడి, షాంపూ యాడ్ చేయండి. ఇప్పుడు 200 మి.లీ. నీరు, ఒక టీ స్పూన్ మెంతులు, బియ్యం, కాస్తా కరివేపాకు యాడ్ చేయండి. ప్రతిదీ మరిగే వరకు ఉడికించాలి. ఇప్పుడు గ్యాస్ ఆపేయండి. ఆ తర్వాత ఫిల్టర్ చేసి.. ఒక పాత్రలోకి తీసుకోండి. ఇంకేముంది.. హెర్బల్ షాంపూ రెడీ అయినట్టే.
డాక్టర్ నవనీత్ కౌర్ చెప్పిన చిట్కా
దీన్ని ఎలా ఉపయోగించాలి?
ఈ షాంపూ వాడేటప్పుడు దాన్ని గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. సాధారణ షాంపూతో ఎలా అయితే తలస్నానం చేస్తారో.. ఈ హెర్బల్ షాంపూతో జుట్టును వాష్ చేసుకోవాలి. ఈ రెమెడీని వారానికి కనీసం రెండు ట్రై చేయాలని డాక్టర్ చెబుతున్నారు. ఈ హెర్బల్ షాంపూ మీ జుట్టును శుభ్రపరుస్తుంది. తలపై ఉండే మురికిని తొలగిస్తుంది. ఇది జుట్టును మృదువుగా, పొడవుగా చేయడంలో సాయపడుతుంది.
హెర్బల్ షాంపుతో ప్రయోజనాలు
ఈ హెర్బల్ షాంపూలో ఉన్న టీ పొడి.. జుట్టుకు తగిన మెరుపును ఇస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇందులో వాడే బియ్యం జుట్టును బలపేతం చేయడంతో పాటు మృదువుగా మారుస్తుందని డాక్టర్ అంటున్నారు.
అంతేకాకుండా జుట్టు తెగిపోవడాన్ని నియంత్రిస్తుంది. ఈ షాంపూలు వాడే మెంతులు జుట్టు కుదుళ్లకు తగిన పోషణనిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదల్ని ప్రోత్సహిస్తుంది. కరివేపాకులు తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. జుట్టును నల్లగా మారుస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలికాలంలో జడుట్టు పొడిబారుతుంది. దీంతో.. చాలా మంది అధికంగా నూనె అప్లై చేసుకుంటారు. అయితే, నూనె ఎక్కువగా అప్లై చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తలపై ఎక్కువ నూనె పేరుకుపోతే ఫంగస్ వేగంగా పెరుగుతుంది. ఇది చుండ్రు సమస్యకు కారణమవుతుంది. దీంతో జుట్టు రాలడం పెరుగుతుంది. అందుకే నూనెను సరిగ్గా, సరైన మొత్తంలో అప్లై చేయాలి. నూనె రాసేటప్పుడు దాన్ని గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa