ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించే డ్రింక్

Life style |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 11:09 PM

ఈ రోజుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వ్యాయామానికి దూరంగా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. జంక్ ఫుడ్ తినడం, షుగరీ డ్రింక్స్ తాగడం వల్ల అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.


బరువు పెరిగితే డయాబెటిస్, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. ఇక, బరువు తగ్గడానికి చాలా మందికి అనేక పద్ధతులు ఫాలో అవుతున్నారు. కొందరి తినే తిండిలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. చాలా మందికి బరువు తగ్గడానికి ఏం తినాలో, తాగాలో తెలియదు. బరువు తగ్గడానికి మ్యాజిక్ డ్రింక్ ఒకటి ఉంది.


ఈ డ్రింక్ రోజూ తాగితే బరువు తగ్గడమే కాకుండా.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి అనుకుంటున్నారా, అదే బ్లాక్ కాఫీ. ఈ డ్రింక్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఎప్పుడు, ఎంత మోతాదులో తాగాలో చాలా మందికి క్లారిటీ లేదు. ఇలాంటి వారికి క్లారిటీ ఇచ్చారు డైటీషియన్ తమన్నా దయాల్. ఆమె ప్రకారం బరువుతో పాటు కొవ్వు తగ్గడానికి బ్లాక్ కాఫీ ఎంత మోతాదులో తాగాలి, ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.


బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఎలా సాయపడుతుంది?


బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఈ పదార్ధం గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది మీ శరీరంలో కొవ్వును వేగంగా బర్న్ చేయడంలో సాయపడుతుంది. అదనంగా బ్లాక్ కాఫీ కాలేయంపై పనిచేస్తుంది. కాలేయాన్ని సక్రియం చేస్తుంది. అంటే కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరు మెరుగవ్వడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అంటే విషపదార్థాల్ని బయటకు పంపుతుంది. దీంతో, బరువు తగ్గడం ఈజీ అవుతుందని తమన్నా అంటున్నారు.


బ్లాక్ కాఫీ ఎప్పుడు తాగాలి?


​బ్లాక్ కాఫీ తాగడం అందరికీ సరైనది కాదు. తాగే ముందు మీ శరీర రకాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని డైటీషియన్ తమన్నా అంటున్నారు.అసిడిటీ సమస్యతో బాధపడేవారు బ్లాక్ కాఫీని ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. ఇక, బ్లాక్ కాఫీని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలని డైటీషియన్ తమన్నా అంటున్నారు. ఇది మీ శక్తి స్థాయిల్ని పెంచుతుంది. వ్యాయామానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వేగంగా బర్న్ చేస్తుంది.


డైటీషియన్ తమన్నా ఏం చెప్పారంటే


ఎంత మోతాదులో తాగాలి?


బ్లాక్ కాఫీ ప్రయోజనకరమే, కానీ ప్రతిదీ ఎక్కువగా తాగడం చెడ్డది. ఎక్కువ మోతాదులో తాగితే లాభాలు చేయకపోగా.. సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. మీకు 45 ఏళ్లు వయసు అంతకంటే ఎక్కువ ఉంటే.. రోజుకు 6-7 కప్పుల బ్లాక్ కాఫీ తాగకూడదు. ఇది రక్తపోటు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 2 నుంచి 3 కప్పుల బ్లాక్ కాఫీ తాగితే సరిపోతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా కాలేయంతో ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.


రాత్రిపూట మాత్రం తాగకండి


రాత్రిపూట బ్లాక్ కాఫీ తాగడం వల్ల నిద్రపోయే సమయంలో కొవ్వు కరుగుతుందని చాలా మంది భావిస్తారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదని డైటీషియన్ తమన్నా అంటున్నారు. పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గదు అంతేకాకుండా మీ నిద్ర చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, పడుకునే ముందు తాగడం మానుకోండి. సరైన సమయంలో, సరైన పరిమాణంలో బ్లాక్ కాఫీ తాగడం వల్ల జీవక్రియ, శక్తి పెరగడం ద్వారా బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు.


బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ మాత్రమే సరిపోదు


బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ ఒక్కటే సరిపోదు. బ్లాక్ కాఫీతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాల్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. అంతేకాకుండా చక్కెరతో పాటు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి.


బరువు నియంత్రణ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా మంచిది. రోజుకు కనీసం 30-40 నిమిషాల చురుకైన నడక, కార్డియో వ్యాయామాలు చేయండి. అంతేకాకుండా తక్కువ కార్బోహైడ్రేడ్ ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. రోజుకు 8 నుంచి 9 గ్లాసుల నీరు తాగడం మర్చిపోవద్దు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa