ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీపీ షుగర్ లివర్ సమస్యలకు ఒకే ఒక పొడితో చెక్ పెట్టేయండి

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 11:57 PM

షుగర్ ఉన్న వాళ్లు తప్పనిసరిగా నేరేడు పండ్లు తినాలని డాక్టర్స్ సూచిస్తారు. అయితే..ఈ పండ్లు తిన్నప్పుడు లోపలి గింజల్ని చెత్త బుట్టలో పారేస్తాం. కానీ..కేవలం పండ్లు మాత్రమే కాదు. లోపల ఉండే గింజలు కూడా ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. కేవలం డయాబెటిస్ ని తగ్గించడంలోనే కాదు. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో ఇవి చాలా బాగా పని చేస్తాయి. ఇన్సులిన్ ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. అయితే..ఈ గింజలను పొడి చేసుకుని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు చెఫ్, హెల్త్ ఎక్స్ పర్ట్ శ్రుతి మహాజన్. మరి ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి. ఎలా వాడాలో చూద్దాం.


నేరేడు పండ్లు


వీటినే జామూన్ అని కూడా పిలుస్తారు. వేసవిలో దొరికే ఈ పండ్లు రుచిలోనే కాదు. ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటాయి. ఇండియన్ బ్లాక్ బెర్రీగా వీటిని పిలుచుకుంటారు. ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. షుగర్ తగ్గించడంలో ఎంతో తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మురికిని వదిలించడంలో చాలా బాగా పని చేస్తుంది. ముఖ్యంగా బాడీ డిటాక్స్ లా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. అయితే..ఈ పండ్లలోని గింజలతోనూ దాదాపు ఇంతే లాభాలుంటాయి. వాటిని పారేయకుండా సరైన విధంగా వాడితే ఈ ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు ఎక్స్ పర్ట్ శ్రుతి మహాజన్. అంతే కాదు. బాడీ డిటాక్స్ లా ఇది ఎలా పని చేస్తుంది. ఎలా వాడాలో కూడా వివరించారు.


ఏం చేయాలి


నేరేడు పండ్లు తిన్నప్పుడు ఆ గింజలు పారేయకుండా అలాగే పక్కన పెట్టాలి. వాటిని పూర్తిగా శుభ్రం చేసి ఓ కప్పులో ఉంచాలి. కనీసం నాలుగు రోజుల పాటు గాలి తగిలేలా ఉంచితే మంచిది. ఇలా చేయడం వల్ల అవి పూర్తిగా ఎండిపోతాయి. ఆ తరవాత ఆ గింజలను గ్రైండ్ చేసుకోవాలి. అంతే. ఈ పొడిని రెగ్యులక్ గా వాడితే సరిపోతుంది. అయితే..గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకుంటే పోషకాలన్నీ సరైన విధంగా అందుతాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్లు రెగ్యులర్ గా తీసుకుంటే చాలా త్వరగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. దీంతో పాటు లివర్ డిటాక్స్ అవుతుంది. అంతే కాదు. బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ అవుతుంది. అది ఎలానో చూద్దాం.


తయారీ విధానం


బ్లడ్ షుగర్ కంట్రోల్


నేరేడు గింజల్లో జాంబోలిన్ , జాంబోసిన్ అనే కంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో షుగర్ విడుదలయ్యే ప్రాసెస్ ని కాస్త స్లో చేస్తాయి. అంటే..ఏదైనా తిన్నప్పుడు చాలా వేగంగా గ్లూకోజ్ రక్తంలోకి విడుదలవుతుంది. అలా జరగకుండా చూడడంలో ఈ గింజల పొడి బాగా పని చేస్తుంది. అంతే కాదు. సహజంగానే ఇన్సులిన్ లెవెల్స్ ని పెంచుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఈ గింజలు లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే.. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఎంత వేగంగా షుగర్ రిలీజ్ అవుతోందనే దాన్ని బట్టి ఈ ఇండెక్స్ లెక్కిస్తారు. ఈ విషయంలో నేరేడు గింజలు చాలా తక్కువ ఇండెక్స్ కలిగి ఉంటాయి. డయాబెటిస్ ని సహజంగానే తగ్గిస్తాయి.


నేచురల్ డిటాక్స్


ఈ నేరేడు గింజల పొడి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల విపరీతంగా చెమట పట్టడం, యూరిన్ రావడం తగ్గుతుంది. సరైన విధంగా లోపల మురికి వీటి ద్వారా వెళ్లిపోతుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం..ఇది లివర్ డిటాక్స్ లా పని చేస్తుంది. లివర్ లో పేరుకుపోయిన మురికిని క్లీన్ చేసేస్తుంది. అంతే కాదు. ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లా పని చేస్తుంది. ఇందులో ఎలాజిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ కంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్సే. శరీరాన్ని ఎప్పుడూ క్లీన్ గా ఉంచడంలో తోడ్పడతాయి. బాడీని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంలోనూ ఈ పొడి చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.


ఎలా వాడితే మంచిది


ఈ పొడిని పరగడుపున తీసుకోవడం చాలా మంచిది. ఒకేసారి పొడి చేసి పెట్టుకుని రోజూ అర టేబుల్ స్పూన్ మేర గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని తాగాలి. అయితే..భోజనం చేసిన తరవాత గడ్డ పెరుగు లేదా మజ్జిగలో ఈ పౌడర్ కలుపుకుని తాగితే చాలా త్వరగా జీర్ణమైపోతుంది. కాకపోతే..రోజూ కేవలం ఓసారి మాత్రమే వాడాలి. డోస్ మించితే మంచిది కాదు. రోజూ ఈ పొడి వాడుతూ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే ఎంత తేడా వచ్చింది అన్నది మీకే తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa