"ప్రేమ" పేరుతో జరిగే దారుణాలు ఇటీవల కాలంలో ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. ప్రేమ అనేది ఒక పవిత్రమైన బంధంగా చూడాలి.. కానీ కొందరు వ్యక్తులు దానిని తమ స్వార్థ ప్రయోజనాలకు, ఆధిపత్య ధోరణికి ఒక సాధనంగా వాడుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రేమించిన వారి ఉసురు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన అలాంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని ఆమె ప్రియుడు ఆస్పత్రిలో అందరి కళ్లముందే చంపేశాడు. ఇంత జరుగుతున్నా బాధితురాలిని కాపాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. నర్సింగ్‌పూర్ జిల్లాలోని పటేల్ వార్డుకు చెందిన సంధ్య చౌదరి అనే విద్యార్థిని.. ఒక బంధువును జూన్ 27న చూడడానికి ఆసుపత్రికి వచ్చింది. ఆస్పత్రిలో సంధ్యను చూసి అభిషే కోష్టి అనే వ్యక్తి ఆమెను ట్రామా సెంటర్ వరకు వెంబడించాడు. సంధ్య ట్రామా సెంటర్‌లోని 22వ గది బయట కూర్చుని ఉండగా.. ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. అనంతరం అభిషేక్ ఆమెపై దాడి చేశాడు. అందరూ మంది చూస్తుండగానే ఆమె గొంతు కోసి చంపేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సంధ్య అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
రక్తం తక్కువగా ఉందని ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా, మందులు వాడకుండానే ఇప్పుడు చెప్పే ఫుడ్స్ తిని బ్లడ్‌ని పెంచుకోండి
ఈ సంఘటన జరిగినప్పుడు చాలా మంది ఆసుపత్రి సిబ్బంది అక్కడే ఉన్నారు. కానీ ఎవరూ ఆమెను కాపాడడానికి ప్రయత్నించలేదు. తాము జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అభిషేక్.. తమను కూడా చంపేస్తానని బెదిరించినట్లు సిబ్బంది చెప్పారు.
ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంధ్య మృతదేహాన్ని కొన్ని గంటలపాటు అక్కడే ఉంచి విచారణ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే వారు రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నర్సింగ్‌పూర్ ఎస్పీ మృగాఖి దేకా మాట్లాడుతూ నిందితుడిని గంటలోపే అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు, బాధితురాలు సోషల్ మీడియా ద్వారా పరిచయమై రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. ఈ ఏదాడి జనవరి నుంచి ఆమె మరొకరితో మాట్లాడుతుందని నిందితుడు అనుమానించాడని చెప్పారు. ఆ తర్వాత ఆమె తనను మోసం చేసిందని.. అందుకే ఆమెను చంపి తాను కూడా చనిపోవాలని నిందితుడు అనుకున్నట్లు వెల్లడించారు. దాడి చేసిన తర్వాత అతను తనను తాను గాయపరచుకోవడానికి ప్రయత్నించాడు.. కానీ అది విఫలమైందని ఎస్పీ తెలిపారు.
ఆసుపత్రిలో ఇంత దారుణం జరగడం అందరినీ కలచివేసింది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రులలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa