విమాన కాక్ పిట్ నుంచి మేడే కాల్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిన తర్వాత దీని గురించి ప్రజల్లో చాలా మందికి ఓ అవగాహన వచ్చింది. అయితే బుధవారం రోజు ఢిల్లీ నుంచి గోవా బయలుదేరిన ఓ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడగా.. అత్యసవరంగా ల్యాండ్ చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమదమూ జరగలేదు. ఇదంతా మనకు తెలిసిందే కాగా.. అత్యసవర ల్యాండింగ్ కంటే ముందే ఈ విమాన పైలెట్లు ప్యాన్ ప్యాన్ ప్యాన్ అనే సందేశాన్ని పంపారు. ఆ తర్వాతే విమానాన్ని ముంబయిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మరి ఈ మెసేజీకి అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బుధవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్ బస్ ఏ320 నియో విమానం.. గోవాకు బయలు దేరింది. మొత్తంగా విమానంలో 187 మంది ప్రయాణికులు ఉండగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈక్రమంలోనే విమానం టేకాఫ్ కాగా.. కాసేపటికే ఇంజిన్‌లో అసాధారణమైన కంపనాలను పైలట్ గమనించారు. దీంతో విమాన భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. పైలట్ వెంటనే ఏవియేషన్ టర్మినిక్ లో 'ప్యాన్-ప్యాన్-ప్యాన్' అనే అత్యవసర సంకేతాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి తెలియజేశారు. ఆ తర్వాత కాసేపటికే విమానాన్ని ముంబయిలో అత్యసవరంగా ల్యాండ్ చేశారు.
'ప్యాన్-ప్యాన్-ప్యాన్' అంటే ఏమిటి?
ప్యాన్.. ప్యాన్.. ప్యాన్ అనే సందేశం విమానంలోని అత్యవసర పరిస్థితిని సూచించే రేడియో డిస్ట్రెస్ కాల్. అయితే మేడే కాల్ అంత తీవ్రమైనది కాదు. గగనతలంలో ఇంజిన్ వైఫల్యం తలెత్తినప్పుడు పైలెట్ ఈ ఎమర్జెన్సీ మెసేజీనీ పంపిస్తారు. ప్రాణాపాయం లేని సందర్భాల్లో మాత్రమే దీన్ని చెబుతారు. ఈ కాల్.. విమానంలో సమస్య తలెత్తింది, అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతాన్ని ఇస్తుంది. పరిస్థితి అత్యంత తీవ్రమైనది కానప్పటికీ.. క్లిష్టమైనది అని చెప్పేందుకు ఈ మెసేజీ ఇస్తారు.
ఉదాహరణకు ట్విన్ ఇంజిన్ విమానాల్లో ఒక ఇంజిన్ విఫలమై.. మరొకటి పని చేస్తున్నప్పుడు దీన్ని పంపిస్తారు. పైలెట్ ఈ సందేశాన్ని పంపిన తర్వాత ఏటీసీ తక్షణ చర్యలు చేపడుతంది. గగనతలాన్ని క్లియర్ చేసి.. విమానం అత్యవసరంగా దిగేందుకు అవకాశం కల్పిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎయిర్ పోర్డు వద్ద ముందు జాగ్రత్తగా ఎమర్జెన్సీ సేవలను సిద్ధం చేస్తుంది.
బుధవారం ఇడిగో విమాన పైలెట్ కూడా ఇదే మెసేజీని పంపగా.. ముంబయిలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే.. విమానయాన నిపుణులు ఇంజిన్ సమస్యను విశ్లేషించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక అధికారిక ప్రకటనలో.. సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని దారి మళ్లించినట్లు ధ్రువీకరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, మరో విమానంలో వారి గమ్యస్థానమైన గోవాకు పంపించామని తెలిపింది. ప్రయాణీకుల భద్రతకు ఇండిగో ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఆ ప్రకటనలో పునరుద్ఘాటించారు. ఈ సంఘటన విమానయానంలో భద్రతా ప్రోటోకాల్స్, పైలట్ల నైపుణ్యం ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa