విదేశాల్లోనూ వరకట్న వేధింపులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, భారత్‌కు చెందిన మరో మహిళ వరకట్న దాహానికి బలైంది. అతుల్య శేఖర్ అనే కేరళ మహిళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో తన నివాసంలో శనివారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఆమె భర్త సతీష్‌పై కేరళ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. గల్ఫ్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. తన 30వ పుట్టిన రోజు నాడే అతుల్య మృతిచెందడం అత్యంత బాధాకరం. అంతేకాదు, ఆమె కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఇలా జరిగింది. రోల్లా ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో అతుల్య విగతజీవిగాపడి ఉండటాన్ని ఆమె సోదరి, బావ గుర్తించారు. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే కేరళకు చెందిన ఓ వివాహిత, తన 16 నెలల పాపను చంపి తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన షార్జాలోనే చోటుచేసుకుంది.
అతుల్య భర్త సతీష్‌పై ఆమె తల్లి కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 18, 19 మధ్య తన కుమార్తెను గొంతునులిపి ఊపిరాడకుండా చేసిన సతీష్. కడుపుపై కాలితో తన్ని, తలపై ప్లేట్‌తో కొట్టాడని ఆరోపించారు. ఇదే తన కుమార్తె మృతికి కారణమైందని ఆమె ఆరోపణలు గుప్పించారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2014లో అతుల్య, శేఖర్‌లకు వివాహం జరగ్గా.. పదేళ్ల పాప ఉంది. పైళ్లైనప్పప్పటి నుంచి అథుల్యను అదనపుకట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. పెళ్లి సమయంలో బైక్, 43 సవర్ల బంగారం ఇచ్చినప్పటికీ మరింత డబ్బు ఇవ్వలేదని వేధించారని చెప్పారు. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ వరకట్న వేధింపులతో భారతీయ మహిళలు ఆత్మహత్యకు పాల్పడటం కలవరానికి గురిచేస్తోంది. ఇటీవల యూపీలో అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఒంటిపై సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటసపై బీఎన్ఎస్ , 1961 వరకట్న నిషేధ చట్టం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఆమె భర్త సతీశ్ ఖండించారు. ‘ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటే నాకే నమ్మబుద్ది కావడం లేదు. నన్ను జైలుకు పంపడానికి కుట్ర చేస్తున్నారు.. నిజాలు వెలుగులోకి రావాల్సిందే’ అని అన్నారు. పెళ్లి సమయంలో భారీగా బంగారం, డబ్బు ముట్టజెప్పినా.. అది సరిపోదని ఇంకా కావాలని అత్తింటివాళ్లు వేధింపులకు గురిచేస్తోన్న ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి.
అతుల్య తండ్రి మాత్రం తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. ఆమె మరణం కూడా అనుమానాస్పదంగా ఉందని, గతంలోనూ వేధింపులు ఎదుర్కొందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అథుల్య గాయాలతో ఉన్న దృశ్యాలు, భర్త ఒక ప్లాస్టిక్ స్టూల్‌తో ఆమెను కొట్టేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలను కూడా కుటుంబం విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa