ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త పథకం: ఉచిత మొబైల్ ఫోన్లు! మీరు అర్హులేనా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 21, 2025, 08:13 PM

ఏపీ సర్కార్‌ శ్రవణ మరియు మౌన దివ్యాంగులకు ఓ గొప్ప ఊరట కలిగించే ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా టచ్‌స్క్రీన్ మొబైల్ ఫోన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రత్యేక ప్రతిభావంతుల శాఖ అధికారి ఎ.డి.వి. కామరాజు తెలిపారు.
*అర్హతలు ఇలా ఉన్నాయి:కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి ,ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి, సైన్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలికనీసం, 40% లేదా అంతకంటే ఎక్కువ శారీరక వైకల్యం ఉండాలి,కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి
*దరఖాస్తు ప్రక్రియ:ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా www.apdascac.ap.gov.inఅనే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి.
*అప్లికేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు:
→ఆధార్ కార్డు
→10వ తరగతి & ఇంటర్ మార్కుల జాబితా
→వైకల్యం ధ్రువీకరణ పత్రం
→సైగల భాషలో ప్రావీణ్యం ఉన్నట్లు సర్టిఫికెట్
→కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/BC)
→ఆదాయ సర్టిఫికెట్
→తెల్ల రేషన్ కార్డు ప్రతిలిపి
→పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
*ఇతర దివ్యాంగులకు పరికరాల పంపిణీ:18 సంవత్సరాల లోపు దివ్యాంగ బాలబాలికలకు, సమగ్ర శిక్ష పథకం ద్వారా అవసరమైన సహాయక పరికరాలు అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా తదనుగుణంగా స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ఆగస్ట్ 26 తేదీతో పూర్తవుతాయి.
*అందించబడే పరికరాలు:
→మూడు చక్రాల సైకిళ్లు
→వీల్‌ఛైర్లు
→వినికిడి యంత్రాలు
→చంక కర్రలు
→చూపుతో ఇబ్బందిపడే వారికి ప్రత్యేక TLM కిట్లు
→మానసిక దివ్యాంగుల కోసం ప్రత్యేక ఉపకరణాలు


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa