ముంబై శాంటాక్రూజ్‌లో ఒక దొంగ బాబా అమాయక మహిళను మాయమాటలతో మోసం చేసి, అత్యాచారానికి పాల్పడ్డ ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళకు దెయ్యం పట్టిందని నమ్మించి, తాను దానికి నివారణ చెబుతానని బాబా భరోసా ఇచ్చాడు.
ఆ మహిళకు ప్రతికూల శక్తుల ప్రభావం ఉందంటూ బాబా అనేక మంత్రాలు, పూజలు అవసరమని చెప్పాడు. ఆమెను ఒంటరిగా పిలిపించుకొని, ఆ 'చికిత్స' పేరుతో శారీరక వేధింపులకు దిగాడు. మాయ మాటల్లో పడిపోయిన ఆమె అనంతరం జరిగిన ఘటనను తెలియజేశారు.
దెయ్యం ప్రభావం పోగొట్టాలనే నెపంతో జరిగిన ఈ దారుణం, బాధితురాలు తట్టుకోలేని స్థితిలో పోలీసులను ఆశ్రయించేందుకు దారితీసింది. ఆమె ఫిర్యాదుతో శాంతాక్రూజ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన మరోసారి ప్రజల్లో మోసపూరిత బాబాలపై అవగాహన అవసరమని స్పష్టం చేస్తోంది. మహిళల భద్రత కోసం పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa