మీరు తరుచుగా బ్యాంకుకు వెళ్తారా? వ్యక్తిగత, బిజినెస్ లావాదేవీలు నిర్వహిస్తుంటారా? బ్యాంకు ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏ ఏ రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయి, ఏ రోజుల్లో మూసి ఉంటాయి అనేది ముందే తెలుసుకోవాలి. అందుకు తగినట్లుగానే పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే చివరి క్షణంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నవంబర్ 2025 నెలలో బ్యాంకులకు మొత్తం 13 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాలతో పాటుగా పండగల, జాతీయ సెలవు దినాలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో బ్యాంకులకు ఏ ప్రాంతంలో ఏ రోజు సెలవు ఉంటుందో తెలుసుకుందాం.
నవంబర్ 1వ తేదీ శనివారం: కన్నడ రాజ్యోత్సవం, ఇగాస్ బగ్వాల్ సందర్భంగా కర్ణాటక, ఉత్తరాఖండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. రాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే రోజుగా కన్నడ రాజ్యోత్సవం నిర్వహిస్తారు. ఉత్తరాఖండ్‌లో దేవతల దీపావలి పండుగగా ఇగాస్ బాగ్వాల్ జరుపుతారు.
నవంబర్ 3వ తేదీ ఆదివారం: దేశవ్యాప్తంగా ఆదివారం రోజు సాధారణ సెలవు ఉంటుంది.
నవంబర్ 5వ తేదీ బుధవారం: గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా మధ్యప్రదేశ్, పంజాబ్, ఒడిశా, హరియాణా, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, మేఘాలయ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్, బెంగాల్, కేరళ, మిజోరం సహ పలు రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.
నవంబర్ 6వ తేదీ గురువారం: నోంగ్ క్రెమ్ డ్యాన్స్ ఫెస్టివల్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 7వ తేదీన శుక్రవారం: వంగల పంజగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూతపడతాయి.
నవంబర్ 8వ తేదీ శనివారం: రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
నవంబర్ 9వ తేదీ ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ హాలీడే ఉంటుంది.
నవంబర్ 16వ తేదీ ఆదివారం: దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 22వ తేదీ శనివారం: రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
నవంబర్ 23వ తేదీ ఆదివారం: బ్యాంకులకు దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.
నవంబర్ 30వ తేదీ ఆదివారం: అన్ని బ్యాంకులకు దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.
ఈ సేవలు ఉండవు..
అయితే బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సర్వీసులు పని చేస్తాయి. కానీ, చెక్ క్లియరింగ్, క్యాష్ డిపాజిట్లు లేదా పాస్‌బుక్ అప్‌డేట్స్ వంటి కౌంటర్ సర్వీసులు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa