భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణను తానే ఆపానని, అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, కానీ ఆ దేశాల పేర్లు ఎవరికీ తెలియవని, భారత్-పాక్ గొడవను కూడా తానే సెటిల్ చేశానని, దీనికి నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వలేదని నెతన్యాహు వద్ద తన ఆవేదనను వెళ్లగక్కారు. అయితే, భారత్ మాత్రం ఈ వాదనను ఖండిస్తూ, మే నెలలో జరిగిన కాల్పుల విరమణ కేవలం ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ల (DGMO) మధ్య జరిగిన చర్చల ఫలితమేనని, మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa