ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) ద్వారా ప్రజల జీవితాలు వేగంగా, సమర్థవంతంగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ డేటా ఆధారిత పాలన వ్యవస్థ ప్రజా సేవలను రియల్ టైమ్‌లో అందిస్తూ, పారదర్శకత, వేగం, సౌలభ్యాన్ని తీసుకొస్తోంది. టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన హైలైట్ చేశారు.
1990లలో బిల్ గేట్స్‌తో జరిగిన మీటింగ్ తర్వాత సాంకేతికత ద్వారా పౌర సేవలను మెరుగుపరచాలనే ప్రేరణ పొందానని సీఎం చంద్రబాబు X (ట్విట్టర్)లో గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే టెక్ ద్వారా పాలనను బలోపేతం చేయాలనే ఆలోచన బలపడింది. ఇప్పుడు RTGS ద్వారా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఫలితాలు సాధిస్తున్నామని, యువ మేధస్సుతో నిండిన ఈ కేంద్రం రాష్ట్ర ప్రగతికి కీలకమని వివరించారు.
బిల్ గేట్స్ ఈ రోజు అమరావతిలోని సచివాలయ RTGS కేంద్రాన్ని సందర్శించడం సంతోషకరమని సీఎం తెలిపారు. డేటా లేక్, AWARE 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని హెల్త్ ప్రాజెక్టు వంటి ఇన్నోవేషన్లను ఆయనకు ప్రదర్శించారు. బ్లాక్‌చెయిన్ ద్వారా భూ రికార్డుల భద్రత, డిజిటల్ హెల్త్ రికార్డ్స్, AI ఆధారిత నిర్ణయాలపై చర్చలు జరిగాయి. బిల్ గేట్స్ ఈ వ్యవస్థను ప్రశంసించారు.
RTGS రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు బలమైన ఆధారమవుతోంది. టెక్నాలజీతో పాలనను సమర్థవంతం చేసి, ప్రజలకు త్వరిత సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. బిల్ గేట్స్ సందర్శన ఈ దిశగా మరింత బలాన్నిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa