ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ చేతిలో ఓటమి సిగ్గుచేటు: బాబర్ అజామ్

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 07:35 PM

టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమి తమ జట్టుకు సిగ్గుచేటు, అవమానకరం అని పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ యూనిట్‌గా మేము మంచి ప్రదర్శన చేయలేకపోయాము. నేను తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం బాధగా ఉంది. కీలక మ్యాచ్‌లో జట్టు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పులను గుర్తించి.. సరిదిద్దుకోవాలి. తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాము. ప్రస్తుతం మా పూర్తి దృష్టి నమీబియాతో జరగబోయే మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్ గెలిచి సూపర్ 8 దశకు అర్హత సాదించాలి. ఇదే ఇప్పుడు మా టార్గెట్. మేము ఇక్కడకు వచ్చింది కేవలం ఆడేందుకు కాదు, ట్రోఫీ గెలవడానికే. వరల్డ్‌కప్‌ను గెలిచి పాకిస్థాన్ ప్రజలను గర్వపడేలా చేయాలనే సంకల్పంతో ఉన్నాం' అని చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa