ఇండియా పోస్ట్ మరోసారి దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది. గతంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసిన ఇండియా పోస్ట్, ఈసారి 35 సర్కిళ్లలో 38,926 పోస్టుల భర్తీకి ఒకేసారి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 38,926 పోస్టుల్ని భర్తీ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోను 1716 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2022 జూన్ 5 లోగా అప్లై చేయాలి.
విద్యార్హతల వివరాలు చూస్తే అభ్యర్థులు స్థానిక బాషలో 10వ తరగతి పాసై.. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌లో పట్టు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు. వేతనాల వివరాలు చూస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D01.aspx లింక్‌లో చూడండి.