పోస్టాఫీస్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఓ అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ మంచి రాబడి అందుకోవచ్చు. 'గ్రామ్ సంతోష్ ఇన్సూరెన్స్ స్కీమ్' ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల రూ.22తో ఏకంగా రూ.8 లక్షలు పొందొచ్చు. 19 ఏళ్ల వయసు దాటిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 55 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ పొందొచ్చు.
ఈ పాలసీని కనీసం రూ. 10 వేల బీమా మొత్తానికి, గరిష్టంగా రూ.10 లక్షల బీమా మొత్తానికి పొందొచ్చు. పాలసీ టర్మ్ 35, 40, 45, 50, 55, 58, 60 ఏళ్లుగా ఉంటుంది. ఉదాహరణకు మీకు 25 ఏళ్లు ఉన్నాయని అనుకుందాం. రూ.3 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు మెచ్యూరిటీ కాలంలో ఎంత డబ్బులు పొందొచ్చొ తెలుసుకుందాం. 35 ఏళ్లు- రూ.4.44 లక్షలు, 40 ఏళ్లు - రూ.5.16 లక్షలు, 45 ఏళ్లు -రూ.5.88 లక్షలు, 50 ఏళ్లు - రూ.6.6 లక్షలు, 55 ఏళ్లు - రూ.7.3 లక్షలు, 58 ఏళ్లు - రూ.7.75 లక్షలు, 60 ఏళ్లు - రూ.8.04 లక్షలు లభిస్తాయి. ఇప్పుడు నెలవారీ ప్రీమియం విషయానికి వస్తే..35 ఏళ్ల టర్మ్ - రూ.3518, 40 ఏళ్ల టర్మ్ - రూ.1693, 45 ఏళ్ల టర్మ్ - రూ.1223, 50 ఏళ్ల టర్మ్ - రూ.956, 55 ఏళ్ల టర్మ్ - రూ.768, 58 ఏళ్ల టర్మ్ - రూ.690, 60 ఏళ్ల టర్మ్ - రూ.643. ఒక వేళ మీరు 25 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే 60 ఏళ్ల రిటైర్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే 35 ఏళ్లు ప్రీమియం కట్టాలి. అంటే మీరు నెలకు రూ.643 చెల్లించాలి. రోజుకు రూ.22 ఆదా చేస్తే చాలు. మెచ్యూరిటీ సమయంలో రూ.8.4 లక్షలు పొందొచ్చు.