మొబైల్ టెలికాం రంగంలో 5జీ టెక్నాలజీ వస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం అన్నీ సిద్దం చేస్తోంది. ఇండియాలో 20 నుంచి 25 నగరాల్లో మొదటగా 5జీ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది చివరికి 5జీ సర్వీసులు ప్రారంభమవుతాయని, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నుంచి ఏర్పాట్లు మొదలవుతాయని వెల్లడించారు.