ప్రతినెల విద్యుత్ సిబ్బంది వచ్చి కరెంట్ బిల్ జనరేట్ చేశాకే బిల్లు కడుతుంటాం. అయితే, ఇకపై వారితో పనిలేకుండా సెల్ఫోన్లలోనే బిల్లెంతో తెలుసుకునే వెసులుబాటును విద్యుత్ పంపిణీ సంస్థలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో పలుచోట్ల ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందుకోస మీరు చేయాల్సిందల్లా.. మీరు ఏ డిస్కం పరిధిలో ఉన్నారో దానికి సబంధించి యాప్, భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.