విరాట్ కోహ్లీ నటించిన ప్రకటనలను తాత్కలికంగా నిలిపివేయాలని చైనా మొబైల్ కంపెనీ వివో నిర్ణయించింది. మనీలాండరింగ్ వ్యవహారంలో వివో ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటుంది. కాగా, 2021లో వివో ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు విరాట్ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఈడీ దర్యాప్తు నేపథ్యంలో యాడ్స్‌లో కనిపించేందుకు విరాట్ టీమే విముఖత వ్యక్తం చేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.