న్యాయవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్-2022 పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోసం పరీక్షను జులై 21న రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు.
22న ఐదేళ్ల ఎల్ఎల్బీ, పీజీ లా సెట్‌ను ఒకే సెషన్లో నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థుల కోసం www.lawcet.tsche.ac.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.