ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నంలోని కొత్త కాలేజీల్లో అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.