డ్రైవర్ లేకుండానే బస్సు వెళ్లడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నెల్లూరులోని కావలి వద్ద జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సును ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో, బస్సు డ్రైవర్ సీటులోంచి ఎగిరి కిందపడిపోయాడు. డ్రైవర్ లేకుండానే బస్సు ముందుకెళ్లడంతో కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. 150 మీటర్ల వరకు వెళ్లిన బస్సుకు కండక్టర్ చాకచక్యంతో బ్రేకులు వేయడంతో బస్సు ఆగింది.