ఇటీవలి కాలంలో ఆధార్ కార్డు మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో మోసగాళ్లు ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఆధార్ కార్డు హోల్డర్స్ తమ కార్డులను లాక్ చేయొచ్చు. అవసరమైనప్పుడు అన్‌లాక్ చేయొచ్చు. UIDAI యాప్ 16 అంకెల VID నెంబర్‌ను ఉపయోగించి లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం చేయొచ్చు. మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. అలా చేయడం వల్ల మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు.