నిత్యం మనం వినియోగించే అనేక రకాల కంపెనీల ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర గాడ్జెట్లలలో ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా చార్జర్ లను రూపొందించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు, అన్నీ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒకే చార్జర్ తీసుకురావాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రం ఈ నెల 17న సమావేశం ఏర్పాటు చేసినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి బుధవారం తెలిపారు.