యూజీసీ తాజాగా తీసుకొచ్చిన సరికొత్త ప్రతిపాదన దేశంలో కొత్త చర్చకు తెరలేపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలను విలీనం చేయనున్నట్లు యూజీసీ తెలిపింది. ఈ మూడింటినీ ఒకే పరీక్ష కిందకు తీసుకొస్తే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పరీక్ష నిర్వహించడం సులభతరం అవుతుందని యూజీసీ జగదీష్ కుమార్ తెలిపారు. త్వరలో ఈ విధానాన్ని అమలు చేయనున్నామని, దీని కోసం కమిటీ వేశామన్నారు.