మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో కే10-2022 మోడల్ వచ్చేసింది. గురువారం భారత మార్కెట్లోకి ఈ కారును విడుదల చేసింది. మొత్తం 4 వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో కే10-2022 లభించనుంది. గత ఆల్టోలతో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు వచ్చి చేరాయి. దీని ఎక్స్ షోరూమ్ ఆరంభ ధర రూ.3.99 లక్షలు. కాగా, మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుంచి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.