andhrapradesh
ఆపన్న హస్తం..
ఆపన్న హస్తం..
చేయి కోల్పోయిన దివ్యాంగులకు చేయూత..
ఉచితంగా ఎల్‌ఎన్4 కృత్రిమ చేతుల పంపిణీ
ఆగస్టు 30న లబ్ధిదారులకు అందజేత..
ప్రమాదాలు, అనారోగ్యం తదితర కారణాలతో చేయిని కోల్పోయిన దివ్యాంగులు తమ చేయితో పాటు జీవనోపాధిని కూడా కోల్పోతున్న పరిస్థితి ఎంతో బాధాకరమని, అలాంటి వారికి అండగా నిలిచేందుకు రోటరీ, రెడ్‌క్రాస్ సంస్థలు సంయుక్తంగా ‘చేయూత’ ప్రాజెక్టును చేపట్టాయి.
పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులు ఖరీదైన కృత్రిమ చేతులను కొనుగోలు చేయలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారికి ఎలాంటి ఖర్చు లేకుండా పనులు చేసుకునేందుకు ఉపయోగపడే ఎల్‌ఎన్4 కృత్రిమ చేతులను ఉచితంగా అందించనున్నారు. ఈ ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 30న అనంతపురంలో నిర్వహించనున్నారు.
*మోచేయి కింద నాలుగు అంగుళాల మిగులు చేయి ఉండాలి*
చేయి కోల్పోయి, మోచేయి కింద కనీసం నాలుగు అంగుళాల మిగులు చేయి ఉన్న దివ్యాంగులు ఈ కార్యక్రమానికి అర్హులని నిర్వాహకులు తెలిపారు. అర్హులైన వారు ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
వివరాలకు హెల్ప్‌లైన్: 8866 306 969 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
*మీ ఒక్క షేర్‌తో ఒకరి జీవితంలో వెలుగు*
కృత్రిమ చేయి అవసరమైన ఎంతోమంది పేద దివ్యాంగులకు ఈ కార్యక్రమం గురించి తెలియకపోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అందువల్ల రాయలసీమ ప్రజలు ఈ సమాచారాన్ని వార్త పత్రికలు, వాట్సాప్, సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా విస్తృతంగా షేర్ చేసి, అవసరమైన వారికి చేరేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చేయి కోల్పోయిన వారికి కేవలం కృత్రిమ చేయి అందించడం మాత్రమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను, జీవనోపాధిని తిరిగి అందించడమే ‘చేయూత’ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు.
