andhrapradesh
భాష్యం పాఠశాలలో డ్రగ్స్‌పై అవగాహన..
Andhrapradesh
2026-08-21 14:20:33
By Suryaa News Team
Updated : 21 Aug 2026 14:20 IST
Select Suryaa Now
అనంతపురం విద్య మేజర్ న్యూస్
అనంతపురం హౌసింగ్ బోర్డులోని భాష్యం పాఠశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఐ హనుమంతు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమస్య ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలను సంప్రదించాలని తెలిపారు.
ప్రిన్సిపల్ బాలకృష్ణ మాట్లాడుతూ.. డ్రగ్స్‌తో పాటు చెడు అలవాట్లు, చరవాణి దుర్వినియోగం, ధూమపానం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి–ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు స్వాగతం పలకండి” అనే సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల ప్రతినిధులు, జిల్లా జెడ్ఈఓ రవివర్మ, ఉపాధ్యాయులు, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు.