టెస్టుల్లో క్రికెట్ దేవుడు సచిన్ 68 హాఫ్ సెంచరీల రికార్డును సమం చేసిన ఇంగ్లండ్ స్టార్ జోరూట్

Select Suryaa Now

లీడ్స్ (ఇంగ్లండ్): ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. పాకిస్థాన్‌తో హెడ్డింగ్లీ వేదికగా జరిగిన టెస్టులో 66 పరుగులు చేసి, భారత దిగ్గజం  క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట 
ఉన్న అత్యధిక 68 టెస్టుల  అర్ధసెంచురి రికార్డును సమం చేశాడు.

సచిన్ ఈ ఘనతను 200 టెస్టుల్లో సాధించగా, రూట్ కేవలం 163 మ్యాచ్‌ల్లోనే అదే రికార్డును అందుకోవడం విశేషం. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యంత స్థిరమైన బ్యాటర్ల జాబితాలో రూట్ మరోసారి తన స్థానాన్ని మరింత సుస్థిర పరుచుకున్నాడు

టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు

ఆటగాడు హాఫ్ సెంచరీలు
జో రూట్ 68
సచిన్ టెండూల్కర్ 68
శివనారాయణ్ చంద్రపాల్ 66
రాహుల్ ద్రవిడ్  63
అలన్ బోర్డర్ 63

50+ స్కోర్లలో ఇంకా సచిన్‌దే ఆధిపత్యం

టెస్టుల్లో సెంచరీలు, హాఫ్ సెంచరీలు కలిపి 50+ స్కోర్ల విషయానికి వస్తే సచిన్ టెండూల్కర్  ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆటగాడు 50+ స్కోర్లు 
సచిన్ టెండూల్కర్ 119
జో రూట్ 109
జాక్ కల్లిస్ 103
రికీ పాంటింగ్ 103

జో రూట్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరిన్ని టెస్టు రికార్డులపై కూడా అతని దృష్టి నిలిపినట్లు అయ్యింది . 
ముఖ్యంగా అత్యధిక టెస్టు పరుగుల రికార్డుకు రూట్ ఎంత దగ్గరపడతాడనేది ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ ప్రేక్షకులు ఆసక్తి కరంగా ఎదురు చూస్తున్నారు