రోప్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మహిళా టైలరింగ్..

Select Suryaa Now

రోప్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మహిళా టైలరింగ్.. 

- సర్టిఫికెట్ల పంపిణీ
తాడిపత్రి, మేజర్ న్యూస్ :
స్థానిక రోప్ (ROPE) సొసైటీ ఆధ్వర్యంలో 26 మంది మహిళలకు నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం అభ్యర్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు ఎస్. ఏ. జోసఫ్ రెడ్డి తెలిపారు.
​ఈ కార్యక్రమానికి రోప్ సొసైటీ అధ్యక్షులు ఎస్. ఏ. జోసఫ్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రే. వ . ఫాదర్ కాకర్ల అంతోని రాజు హాజరయ్యారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.
​ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్. ఏ. జోసఫ్ రెడ్డి మాట్లాడుతూ... ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే రోప్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. టైలరింగ్ నేర్చుకోవడం ద్వారా మహిళలు ఇంట్లోనే ఉంటూ సొంతంగా ఆదాయాన్ని గడించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 80 మంది మూడు బ్యాచ్ లుగా శిక్షణ పూర్తి చేశారని తెలియజేశారు.అలాగే 
​ముఖ్య అతిథి రే. వ . ఫాదర్ కాకర్ల అంతోని రాజు మాట్లాడుతూ...మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత కాళ్లపై నిలబడాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఉచిత శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్న రోప్ సొసైటీ సేవలను, అలాగే మహిళలకు మెరుగైన శిక్షణ ఇచ్చిన ట్రైనర్ సుజాతా రెడ్డి కృషిని ఆయన అభినందించారు.
​ఈ కార్యక్రమంలో రోప్ సొసైటీ ప్రతినిధులు, ట్రైనర్ సుజాతా రెడ్డి, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు మరియు స్థానికులు పాల్గొన్నారు.