తెలంగాణలో స్మార్ట్ విద్యుత్ మీటర్లు..?
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఆధునిక మార్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
కొత్తగా ఇచ్చే ప్రతీ పవర్ కనెక్షన్‌కు ముందే స్మార్ట్ మీటర్లను బిగిస్తారు. ఆ తర్వాత క్రమంగా పాత కనెక్షన్లను కూడా ఈ కొత్త విధానంలోకి మారుస్తారు. ఈ మీటర్ల ద్వారా ప్రతి నెల చివరి రోజు (30 లేదా 31వ తేదీ) అర్ధరాత్రి వేళ ఆటోమేటిక్‌గా డిజిటల్ రీడింగ్ నమోదవుతుంది. వెంటనే బిల్లు వినియోగదారుడికి చేరిపోతుంది.
అన్ని రకాల ప్రభుత్వ ఆఫీసులకు మాత్రం ముందస్తు చెల్లింపుల (ప్రీపెయిడ్) మీటర్లను తప్పనిసరిగా అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ మీటర్లతో పోలిస్తే ఈ స్మార్ట్ మీటర్ల తయారీ, ఏర్పాటు వ్యయం చాలా ఎక్కువ. అయితే, ఈదనపు వ్యయాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) భావిస్తున్నాయి.
