డాక్టర్ గుంటూరు సూర్య రామచంద్ర వర్మకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం

Select Suryaa Now

శ్రీగుంటూరి సూర్య రామచంద్రవర్మ తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించి, అనంతరం ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మరియు నిమ్స్ హాస్పిటల్ లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఉత్తీర్ణత సాధించారు. గ్లోబల్ హాస్పిట ల్ లో అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపి, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. గత పదిహేను సంవత్సరాలుగా నిమ్స్ హాస్పిటల్ లో సేవలందిస్తూ, ప్రస్తుత ము ప్రొఫెసర్‌గా మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ యూనిట్2 హెడ్‌గా పనిచేస్తున్నారు. ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ,సూపర్ స్పెషాలిటీ విద్యార్థులను శిక్షణ ఇస్తున్నారు. ఆయన విశిష్ట సేవలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతులమీదుగా అభినందనలు అందుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప వైద్య సేవలను కొనసాగాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నారు. ఈ ఉత్తమ పురస్కారం అందుకోవటంతో ఆయన కుటుంబ సభ్యులు మరియు సోదరుడు మురళి కృష్ణంరాజు మరియు గ్రామస్తులు ఆనందం  వ్యక్తం చేశారు