కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే పవన్ కల్యాణ్... ఏనాడైనా చిరంజీవి తమ్ముడ్నని చెప్పుకున్నాడా అని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా నిలదీశారు. చిరంజీవి పుట్టినరోజున పవన్ కల్యాణ్ తన సొంత అజెండాతో అన్నయ్యను అవమానించాడని ఆయన విమర్శించారు. పవన్ కు పరిటాల రవి గుండు కొట్టించినప్పుడే చిరంజీవికి పెద్ద అవమానం జరిగిందని అన్నారు. చిరంజీవిని అవమానించారని పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడని, భీమవరం సభలో ఏం జరిగిందనడానికి తానే ప్రత్యక్షసాక్షినని మంత్రి రాజా తెలిపారు. భీమవరం సభలో సీఎం జగన్, చిరంజీవిల మధ్య ఆత్మీయతను చూశానని, వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఉంటారని వివరించారు. కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే పవన్ కల్యాణ్... ఏనాడైనా చిరంజీవి తమ్ముడ్నని చెప్పుకున్నాడా? అని నిలదీశారు.
పవన్, నారా, నాదెండ్ల వంటివారు మరో 300 మంది వచ్చినా సీఎం జగన్ ను ఏమీచేయలేరని మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. నారా, నాదెండ్ల ఇద్దరూ పవన్ అనే శిఖండిని కలుపుకుని సీఎం జగన్ పై కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాననే ధైర్యం పవన్ కు ఉందా? అని మంత్రి ప్రశ్నించారు.