కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాధ్ బాబు IPS, ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్చార్జ్ SDPO/దిశ DSP సుంకర మురళీ మోహన్ గారి ఆధ్వర్యంలో తుని పట్టణ పోలీసులు స్థానిక బాలాజీ సెంటర్ లో కళాజాత బృందాలచే అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
మహిళల భద్రత, మహిళల రక్షణ కొరకు ఉన్న చట్టాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 పై ఈ కళాజాత బృందం వారి ఆటపాటల ద్వారా వివరిస్తూ ప్రజలకు, విద్యార్ధినీ విద్యార్ధులకు, యువతకు అవగాహన కల్పించారు. కళాజాత కళాకారుల కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు మరియు యువత ఎంతో ఆశక్తితో, ఉత్సాహంగా తిలకించి జిల్లా పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తరహా కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో తుని టౌన్ CI శ్రీ M. నాగ దుర్గారావు, సర్కిల్ SIలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.