వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సభ్యులు అందరికీ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు పోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శనివారం ఉదయం కార్య వర్గ సమావేశం అనంతరం వివరాలను పాత్రికేయులు కి వెల్లడించారు. ఈ సందర్భముగా శ్రీను బాబు మాట్లాడుతూ
మంగళవారం ఉదయం పదిన్నర గంటల నుంచి నార్ల వెంకటేశ్వరరావు భవనం (వి జే ఎఫ్) ప్రాంగణంలో ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది అన్నారు. వినాయకుడి విగ్రహం తో పాటు వ్రతకల్ప పుస్తకం, పూల , పండ్ల మొక్కలను అందజేయడం జరుగుతోందన్నారు. జర్నలిస్టులు అందరూ ఆరోజు విజేఎఫ్ వినోద వేదిక వద్దకు వచ్చి విగ్రహాలను స్వీకరించాల్సిందిగా ఆయన కోరారు. వినోద వేదిక భవనం ఆధునీకరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తున్నామన్నారు. కార్యదర్శి దాడి రవికుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో అయా కార్యక్రమంలు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యులు సంక్షేమం కోసం త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఫోరమ్ ఉపాధ్యక్షులు, , స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వాహకులు
ఆర్ నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ త్వరలోనే ఉపకార వేతనాలు, మీడియా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కి చెందిన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. కావున సభ్యులు అందరూ కూడా పాల్గొని కార్య క్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజేఎఫ్ ఉపాధ్యక్షులు టి నానాజీ, కోశాధి కారి పి. ఎన్ మూర్తి , ఎగ్జిక్యూటివ్ ప్రతినిధులు, ఇరోతి ఈశ్వరరావు , ఎమ్మేస్సార్ ప్రసాద్, పి వరలక్ష్మి, దివాకర్ రావు, డి. గిరిబాయి , డేవిడ్ రాజ్ , శేఖర మంత్రి , గయాజుద్దీన్ , సనపల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.