రూ. లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్లను మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి మండలం కంచడంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు అనేక వ్యయ ప్రయాసలు తగ్గాయన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం బర్రిపాడు గ్రామాల్లో సుమారు రూ. 50 లక్షలు నిధులతో ఇంటింటికి కుళాయి ఇవ్వడం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే కంచడం శివారు. కొత్తూరు(నాగేశ్వరపురం) గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక సంవత్సరాలు తరబడిగా ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసు కురావడంతో రూ. 1. 10 కోట్లతో రోడ్డు నిర్మాణం చేప డుతున్నామంటూ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ వెలివెల చినబాబు, జెడ్పీటీసీ ఎం. వెంకటరమణ, సర్పంచు బి. చంద్రశేఖర్, వెంకటే శ్వరరావు, ఆర్‌బీకే చైర్మన్లు ప్రసాద్, సత్యనారా యణ, అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్టి శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ బాబూరావు, ఎంపీడీవో స్వర్ణభారతీ, తహసీల్దార్ సత్యనారాయ ణమూర్తి, వైఎస్సార్ సీపీ నాయకులు రాజబాబు, మహేష్, నాగబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.