కృష్ణా జిల్లా: పెనమలూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా చేశారు. 54 వినాయకుడి విగ్రహాలను పలు ప్రాం తాల్లో నిమజ్జనం చేశారు. పెదపులిపాక ఘాట్ వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ క్రేన్లు అధికారులు ఏర్పాటు చేశారు. క్రేన్ల సాయంతో విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. పోలీ సుల బందో బస్తు మధ్య వినాయకుడి విగ్రహాలు గ్రామాల్లో పెద ఎత్తున ఊరేగించారు. పెనమలూరు పల్లిపేట, సుగాలీకాలనీ, రజక రామాలయం, పోరంకి, కానూరు, యనమలకుదురు, తాడిగడప, చోడవరం, పెదపులిపాక, వణుకూరు, గోసాల గ్రామాలలో వినాయక నిమజ్జన వేడుకల మహోత్స వాలు సంబరాలు అంబరాన్ని అంటాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే, కోలాటంతో భారీగా గణనాధుడిని ప్రత్యేక వాహనాలో ఊరేగిం చారు. పెనమలూరు సీఐ ఆర్. గోవిందరాజు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిం చారు. నదీ పరివాహక ప్రాంతంలో పహారా ఏర్పాటు చేశారు. చోడవరం గ్రామంలో నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈ ఘాట్ లో నిమజ్జన కార్యక్రమం అధికారులు నిషేధించారు.