ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాధారణ వ్యక్తిగా భావించి...ఫోటో తీయండి అని బ్రిటన్ రాణిని కోరడటా

international |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 12:02 AM

కొందరు వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్న కొన్ని సందర్భాలలో సాధారణ జనంలో కలసిపోయి సామాన్యుడిలా ఆనందం పొందుతుంటారు. బ్రిటన్ రాణి కూడా నత జీవితంలో ఇలాంటి అనుభవాని కూడా ఎన్నోసార్లు పొందారటా. బ్రిటన్‌ సహా 14 కామన్వెల్త్ దేశాలకు 70 ఏళ్లకు పైగా రాణిగా కొనసాగినా.. క్వీన్ ఎలిజబెత్-IIకు రాణి అనే దర్పం ఏనాడూ లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆమె కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. జనంలోకి వస్తే ఆమె ఒక రాణి అనే విషయం మరిచిపోయి సామాన్యులతో కలిసి పోయేవారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడైతే.. రాణిలా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిలాగే జనంలో కలిసిపోయి తిరిగేందుకు ఆమె ఆసక్తి చూపేవారు. బ్రిటన్ సామ్రాజ్ఞికి హాస్య చతురత కూడా ఎక్కువే. అలా.. ఒకానొక సందర్భంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి క్వీన్ ఎలిజబెత్-2ను గుర్తుపట్టలేదు. కానీ, ఆయనకు రాణిని చూడాలని కోరిక. బ్రిటన్ రాణిని కలిసిన వ్యక్తి అని తెలిసి, ఆయనతో ఫొటోకు ఫోజిచ్చి.. ఆ ఫోటోను ఏకంగా క్వీన్ ఎలిజబెత్‌-2తోనే తీయించుకున్నాడు ఆ అమెరికన్. 


క్వీన్‌ ఎలిజబెత్‌ ఓసారి స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌ సమీపంలోని అబెర్డీన్‌షైర్‌కు పిక్నిక్‌కు వెళ్లారు. ఆమె వెంట సంరక్షణాధికారి రిచర్డ్‌ గ్రిఫిన్‌ ఉన్నారు. అక్కడకు పర్యాటకులు ఎక్కువగా వచ్చేవారు. రాణి ఎలిజబెత్‌ వారిలో కలిసిపోయారు. క్వీన్ ఎలిజబెత్ ఎప్పుడూ తనకు ఎదురుపడిన వారందరినీ ఆగి పలకరించేవారట. ఆ రోజు కూడా ఓ పర్యాటకుల బృందానికి ఆమె హలో చెప్పగా.. వారు ఆమెను గుర్తుపట్టలేదు.


తాము ఎక్కడ నుంచి వచ్చారో తెలిపిన ఆ పర్యాటకులు.. ‘మీరు ఎక్కడుంటారు?’ అని రాణి ఎలిజబెత్‌ను (వాళ్లకు రాణి అని తెలియదు) ప్రశ్నించారు. దానికి రాణి స్పందిస్తూ.. ‘నేను లండన్‌లో ఉంటాను. కానీ, నాకు సెలవుల్లో ఉండేందుకు మరో విడిది కూడా ఉంది. అది ఈ కొండల పక్కనే ఉంటుంది’ అని బదులిచ్చారు. అప్పుడు ఆ బృందంలోని ఓ వ్యక్తి ‘మీరు ఇక్కడకు తరచూ వస్తుంటారా?’ అని అడగ్గా.. ‘నా చిన్నప్పటి నుంచి, ఎన్నో ఏళ్లుగా ఇక్కడకు వస్తూనే ఉన్నాను’ అని రాణి చెప్పారు. వెంటనే ఆయన.. ‘అవునా, అయితే మీరు రాణిని కలిశారా!’ అని అడిగారు.


దానికి క్వీన్ ఎలిజబెత్‌ ఇలా బదులిచ్చారు. ‘నేను రాణిని కలవలేదు. కానీ, డిక్కీ (అధికారి గ్రిఫిన్‌ ముద్దుపేరు) తరచుగా కలుస్తుంటారు’ అన్నారు. గ్రిఫిన్ చూస్తూ చిన్నగా నవ్వారట. వెంటనే ఆ వ్యక్తి ఎంతో ఎగ్జైటింగ్‌తో గ్రిఫిన్ వైపు తిరిగి.. ‘రాణి ఎలా ఉంటారు?’ అని అడిగారు. అప్పుడు గ్రిఫిన్ బదులిస్తూ.. ‘ఆమె కొన్ని సమయాల్లో చాలా సింపుల్‌గా ఉంటారు. ఆమెకు హాస్యచతురత కూడా చాలా ఎక్కువ’ అని చెప్పారట.


అది విన్న తర్వాత ఆ బృందంలోని మరో వ్యక్తి తన చేతిని గ్రిఫిన్ భుజంపై వేస్తూ తన కెమెరాను క్వీన్ ఎలిజబెత్‌ చేతికి ఇచ్చి, తమ ఇద్దరి ఫొటో తీయమని అడిగారట. అప్పుడు రాణి ఆ ఫోటో తీశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎలిజబెత్‌తో కూడా ఫొటో దిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాణి, గ్రిఫిన్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారట.


క్వీన్ ఎలిజబెత్‌-2 పాలన 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో రాణి మాజీ సంరక్షణాధికారి రిచర్డ్‌ గ్రిఫిన్‌.. క్వీన్ ఎలిజబెత్‌కు సంబంధించిన ఈ అరుదైన సంఘటనను మీడియాతో పంచుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ (96) కన్నుమూసిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ‘ఆ ఫొటోలు తన మిత్రులకు చూపించిన తర్వాత అయినా.. ఎవరో ఒకరు నన్ను గుర్తుపట్టి అతడికి చెబుతారేమో..!’ అని క్వీన్ ఎలిజబెత్ అన్నారంటూ రిచర్డ్ గ్రిఫిన్‌ నాటి ఘటన గురించి ఆ ఇంటర్వ్యూలో వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com