మచిలీపట్నంలో శనివారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరించి, మచిలీపట్నం డివిజన్ పరిధిలో లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, టాస్క్ ఫోర్స్ నిరంతరం ఆసుపత్రులు మరియు స్కానింగ్ సెంటర్ లపై పర్యవేక్షణ తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని, తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎవరైనా ఈ కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వారి లైసెన్సులు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్ నందు ఆర్డీఓ ఐ. కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్ లో మచిలీపట్నం డి. ఎస్. పి మాసూం బాషా తో కలిసి పీసీపీఎన్‌డీటీ (ఫ్రీ-కాన్షక్షన్ -ఫ్రీ -నాటల్ డయోగ్నస్టిక్ టెక్నిక్స్)యాక్ట్ పై బందర్ డివిజన్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.