మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని గతంలో ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని.. పరిపాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని పేర్కొంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని.. ఈ అంశంలో వెంటనే స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.