కోడూరులోని ప్రైవేట్ వైద్యశాలను, ప్రైవేటు ల్యాబ్ లను జిల్లా వైద్యాధికారిణి గీతా బాయ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెంగ్యూ, మలేరియా వంటి జరాలు పేర్లు చెప్పి, టెస్టులు చేయాలని, ప్రజల వద్ద అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తే సహించేది లేదని డిఎం అండ్ హెచ్ఓ హెచ్చరించారు.
కోడూరు, మందపాకల పి. హెచ్. సిలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం కోడూరు పి. హెచ్. సి వద్ద ఆమె మాట్లాడుతూ గ్రామాలలో డెంగ్యూ, వైరల్ జరాలు అనుమానాలు వస్తే ప్రజలు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేసి వైద్య సదుపాయాలు అందిస్తారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలకు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, నిర్మూలనకు సక్రమమైన మందులు సమకూర్చడం జరిగిందని అన్నారు. విషపు జర్వరాలు నిర్మూలనకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించడం జరుగుతుందన్నారు.