నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళపై హత్యాచారం ఘటనకు సంబంధించి మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడారు. నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుపు చెంచు కాలానికి చెందిన మహిళ తన మొబైల్ పోయిందని దానిని కనుగొని పెట్టమని అదే కాలనీకి చెందిన పెద్దమనిషి ముత్తయ్య వద్దకు వెళ్లి అడుగగా, అది తన వల్ల కాదని మహిళతో చెప్తాడు. అదే సమయంలో ఈ హత్య కేసులో నిందితులు కూలీ డబ్బులు తీసుకునేందుకు ముత్తయ్య(పొలంలో పనిచేసినారు) వద్దకు వచ్చినారు.ఆ సంభాషణ విని బెల్లంకొండ చెంచు కాలనీలోని వెంకన్న అని అతను పోయిన ఫోన్ కనిపెడతాడని ఆ మహిళకు చెప్పి,తమ వెంట బెల్లంకొండ చెంచుకాలనికి తీసుకెళ్లినారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న ముగ్గురు నిందితులు మార్గం మధ్యలో ఆమెపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడి,మాట మాట పెరగటం వలన ఆమె తలపై బండరాయితో మోది చంపేసి,కాలనీ శివారులో శవాన్ని పెట్టడం జరిగినది. తమ భార్య ఇంటికి రాలేదని మహిళ భర్త, ఆమె తండ్రి మరియు బంధువులు ఆ కాలనిలో వెతుకుతూ ముత్తయ్య వద్దకు వెళ్లి అడుగగా,ఆ మహిళ ఆరోజు సాయంత్రం తన వద్దకు వచ్చిన విషయం,ఆ సమయంలో నిందితులు ఉన్న విషయం గురించి వారికి చెప్తాడు. సదరు విషయం మా పోలీస్ వారికి తెలుపగా ఆ ముగ్గురిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని వారు ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేయడం జరిగినది.ముద్దాయిలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.వారిపై గతంలో ఏమైనా నేరాలు నమోదయ్యాయేమో పరిశీలించడం జరుగుతుంది. స్థానిక మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి.రామకృష్ణారెడ్డి గారితో కలసి బాధితురాలి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ధిక సహాయం అందజేసినారు.