తిరుమల తిరుపతి మహోత్సవాలకు సీఎం జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఐతే ఈ కార్యక్రమం సందర్భంగా హిందూ మత దేవుళ్ళ బొమ్మలని గోడలపై తొలగించి వైసీపీ రంగులతో నింపారని టీడీపీ వారు వరిస్తున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ ఇద్దరి వాదన సరైనదే అని మాత్రం చెప్పలేం. ఐతే ఇదే విషయంపై బీజేపీ నాయకులూ సోము వీర్రాజు స్పందిస్తూ.... కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆనవాళ్లకు వైసీపీ రంగులు పూసినప్పుడే ప్రజలకు ప్రభుత్వ అజెండా ఏంటో అర్థమయ్యింది .ఇప్పుడు ప్రజలే ఆలోచనలో ఉన్నారు దైవం పై భక్తి లేనోల్లకి దేశ భక్తులపై ప్రేమ ఎలా పుట్టిందా? అని. మీ చర్యలకు ప్రతిఫలం ప్రజా క్షేత్రంలోనే దక్కుతుంది అని హెచ్చరించారు.