అధిక లోడు తో తిరుగుతున్న వాహనాల పై రవాణా శాఖ కొరడా ఝలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామనిఅధిక లోడు తో తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విదిస్తున్నామని విశాఖ రవాణా శాఖ ఉప కమిషనర్ రాజరత్నం శనివారం ఒక ప్రకటన ద్వార తెలిపారు. ఈ మేరకు 1. 04. 2022 నుండి 31. 08. 2022 వరకు అధిక లోడు రవాణా చేస్తున్న 493 వాహనాల పై కేసులు నమోదు చేసి 2. 01 కోట్లు జరిమానా విధించామన్నారు. ప్రత్యేక బృందాల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని , అధిక లోడుకు జరిమానా రూ. 20 వేలు, టన్నుకు రూ. 2వే లు చొప్పున జరిమానా విధించడం జరుగుతుందని , కనీసం ఈ జరిమానాలు రూ. 24, వేల నండి రూ 1. లక్ష వరకు విధించడం జరుగుతుందని తెలిపారు. అధికలోడుతో వాహనా నడుపితే చర్యలు తప్పవని సందర్భంగా తెలియజేశారు.