గుంటూరు జిల్లా పెదకాకాని వైసిపి పార్టీ మండల ప్రెసిడెంట్ గొట్టిముక్కల పూర్ణచంద్రరావు పై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం క్షతగాత్రుడు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వైసిపి నాయకుడు పై దాడి జరగడంతో దాడి ఘటనను నిరసిస్తూ మంగళవారం పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో వైసిపి నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకుడు గొట్టిముక్కల పూర్ణచంద్రపై దాడి జరగటం దారుణమన్నారు. దాడి చేసిన వారు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa