గ్రీన్ యాపిల్ లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు గ్రీన్ యాపిల్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్స్‌లో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేస్తాయి. గ్రీన్ యాపిల్స్ జీర్ణక్రియ ప్రక్రియను, కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. వీటిని తింటే బరువు తగ్గొచ్చు.