కృష్ణా: పాత ఎడ్లంక వంతెన నిర్మాణంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎనిమిదిన్నర కోట్లు నిధులు మంజూరు చేయడం పట్ల పాత ఎడ్లంక గ్రామస్తులు సీఎం చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ అవనిగడ్డ బహిరంగ సభలో అడిగిన వెంటనే ఎడ్లంక బ్రిడ్జి కోసం రూ. 8.50 కోట్లు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందన్నారు. ఎంపిటిసి మెరుగుమాల జరుషారాణి మాట్లాడుతూ పాత ఎడ్లంకకు రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తరచూ వచ్చే వరదలకు కాజ్ వే రహదారి కొట్టుకు పోవడం వల్ల అవనిగడ్డ వెళ్లాలంటే వృద్ధులు, చిన్నారులు, విద్యార్ధినిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
పది సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు పడవ దాటుతుండగా గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించినట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి వారిధి కావాలని కోరుతున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదన్నారు. అవనిగడ్డ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహనరెడ్డి దృష్టికి స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పాత ఎడ్లంక వారధి గురించి తీసుకెళ్లగా వెంటనే ఎనిమిదిన్నర కోట్లు నిధులు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ వారధి వల్ల తమ గ్రామస్థులు కష్టాలు తీరిపోతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి తుంగల సుమతీదేవి, అవనిగడ్డ సర్పంచ్ గొరుముచ్చు ఉమా, మాజీ సర్పంచ్ లు సైకం బాబురావు, నలుకుర్తి పృధ్వీ రాజ్, మాజీ ఎంపిటిసి దోవా పిచ్చయ్య, వైఎస్సార్సీపీ గ్రామ కన్వీనర్ నలుకుర్తి రమేష్, గ్రామ పెద్దలు కైతేపల్లి బసవేశ్వరరావు, నలుకుర్తి మణిక్యాలరావు బందెల యసోబు, మునిపల్లి చంటి, మునిపల్లి వెంకటేశ్వరరావు, నాగిడి నాగేశ్వరరావు, నాగిడి వీర్రాజు, పెమ్మాడి ఏడుకొండలు, కొల్లు సత్యనారాయణ, బందెల కుమారి తో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.