సీఎం వైయస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉషాశ్రీ చరణ్ కోరారు. తాము తప్పు చేయటం గొప్ప అని పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ... ఈ రెండూ ఒక లైన్ తీసుకున్నాయి. రెండు రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కల్యాణ్ బూతుల ప్రసంగాన్ని చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేశ్ కూడా సమర్థించారు. చంద్రబాబు సమర్థించిన తరవాత, అదే లైన్‌లో ఎల్లో మీడియాలో డిబేట్లు నడిపారు. ఈ రోజున, తెలుగుదేశం పార్టీ పత్రిక, దాని పేరు చైతన్య రథం అట... ఆ పత్రికలో... అంటే టీడీపీ పత్రికలో... పవన్ కల్యాణ్ మాట్లాడితే బూతులు అవుతాయా... అంటూ టీడీపీ సమర్థించుకుంటూ రెండు పేజీల్లో కథనం రాశారు. పత్రిక టీడీపీది... జన సేనది కాదు. సమర్థన టీడీపీది... ఎందువల్ల? పవన్ బూతులు తిడితే టీడీపీ ఆ కార్యక్రమాన్ని వెనకేసుకు రావటం ఏమిటి? అని ఆమె అన్నారు.