అల్లంతో ఎన్నో రోగాలు దూరమవుతాయి. అల్లం నోటి దుర్వాసన మరియు దంత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు మరియు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. మైగ్రేన్‌ని తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెపోటు రాకుండా చేస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించి, మధుమేహ రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.