సోషల్ మీడియాపై వచ్చే ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 3 నెలల్లో గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. . గత ఏడాది జారీ చేసిన ‘సోషల్ మీడియా మార్గదర్శకాలు.. ఎథిక్స్ కోడ్-2021’కు సవరణలు చేసి, మరింత పదును పెడతామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.